ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి నగదు భద్రంగా అప్పగించిన 108 సిబ్బంది నిజాయితీకి ప్రశంసలు..

May 12, 2026 - 06:03
May 12, 2026 - 06:06
 0  37
ప్రాణాలు కాపాడటమే కాదు… 💰 9 లక్షలు కూడా కాపాడారు
1 / 1

ప్రాణాలు కాపాడటమే కాదు… 💰 9 లక్షలు కూడా కాపాడారు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు జాతీయ రహదారిపై గోల్డెన్ కేఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.

మామిడికాయల లోడ్‌తో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో పాటు సమీపంలో ఉన్న మోటార్ బైక్‌కు దగ్గర ఉన్న 2 కి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తండ్రి-కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందగా కుమారుడు చికిత్స పొందుతున్నాడు.

ప్రమాద సమయంలో బాధితుల వద్ద సుమారు రూ.9 లక్షల నగదు ఉండటం గమనించిన 108 అంబులెన్స్ సిబ్బంది వేణు మరియు సౌజన్య అత్యంత నిజాయితీతో ఆ నగదును భద్రపరిచి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి అధికారులకు అప్పగించారు.

వారి నిజాయితీ సేవలను ప్రశంసిస్తూ సింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ వీరేందర్ మరియు డాక్టర్ వంశీధర్ 108 సిబ్బందిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, అత్యవసర సేవల్లో పనిచేసే సిబ్బంది ప్రజల ప్రాణాలతో పాటు వారి ఆస్తులను కూడా కాపాడటం గొప్ప విషయం అని వైద్యులు పేర్కొన్నారు.

స్థానిక ప్రజలు కూడా 108 సిబ్బంది చూపిన నిజాయితీని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0