సింగరాయకొండ లో నూతన ఎస్సై లేళ్ల సుధీర్ కుమార్ ను కలిసిన కూటమి నాయకులు

May 15, 2026 - 08:20
 0  27

నూతన ఎస్సై సుదీర్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు సింగరాయకొండ, మే 15: సింగరాయకొండకు నూతనంగా నియమితులైన సబ్ ఇన్స్పెక్టర్ (SI) లేళ్ళ సుదీర్ కుమార్‌ను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఐనాబత్తిన రాజేష్ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ గంజాయి రవాణా, రౌడీ షీటర్లు, నేరస్తులు, పోకిరీలపై ఉక్కుపాదం మోపడంతో పాటు ట్రాఫిక్ సమస్యలను సమర్థంగా నియంత్రించి ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సై సుదీర్ కుమార్ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ సంగు వసంతయ్య, కార్యదర్శులు అనుముల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శి తగరం రాజు, శీలం జగదీష్, పసుమర్తి నాగేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య, సుదర్శి చంటి, బ్రహ్మేశ్వరరావు, పసుపులేటి శేషు, మాలకొండయ్య తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0