సింగరాయకొండలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం మరమ్మతుల పరిశీలన

Jun 20, 2026 - 14:57
 0  7
తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, గదుల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి
1 / 1

తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, గదుల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి చెప్పారు.

శనివారం సింగరాయకొండ మండల పరిధిలోని సాంఘీక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో జరుగుతున్న మరమ్మతుల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ​రూ. 47 లక్షల వ్యయంతో శరవేగంగా సాగుతున్న వసతి గృహం మరమ్మతు పనులు ​నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 జరుగుతున్న పనుల నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. వసతి గృహాల మరమ్మతుల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. నిరుపేద విద్యార్థులు బస చేసే ఈ వసతి గృహంలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ మరియు గదుల ఆధునీకరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0