మందలపు ఫౌండేషన్ ద్వారా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ..
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు కలికివాయ గ్రామానికి చెందిన మందలపు గాంధీ చౌదరి ఫౌండేషన్ ద్వారా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మందలపు గాంధీ చౌదరి సోదరుని కుమారులు ఎం శివకృష్ణ, హరికృష్ణ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు .పాఠశాలకు కావలసిన ఇతర సహాయ సహకారాలు కూడా తమవంతుగా అందజేస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కే మహాలక్ష్మి, గాంధీ చౌదరి మరదలు శ్రీమతి ఎం సుమతి అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెంచల బ్రహ్మయ్య ,నాయకులు చిగురుపాటి శేషగిరి ,చీమకుర్తి కృష్ణ ,ఇమ్మడిశెట్టి రామారావు, కోట శ్రీను చంటి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0