కష్టజీవుల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి స్వామి

Apr 15, 2026 - 12:59
 0  34

ప్రకాశం జిల్లా ,సింగరాయకొండ లోని కందుకూర్ రోడ్ లో అన్న క్యాంటీన్ ను బుధవారం నాడు మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ ల ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి అన్నారు .ప్రధానంగా తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ సన్నిబోయిన శ్రీనివాస నాయుడు, చిగురుపాటి గిరి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0