రీసర్వేతో సమస్యలు పరిష్కారం..
అనంతరం టంగుటూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్
జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనాకుమారి మంగళవారం టంగుటూరు మండలంలో పర్యటించారు. ముందుగా ఐదవ విడత రీసర్వే జరుగుతున్న వల్లూరు గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ గ్రామంలో గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి రైతుల సమక్షంలోనే ఈ-కేవైసీ చేస్తున్నారా అని ఆరా తీశారు. ఆ విధంగానే అధికారులు చేస్తున్నట్లు స్థానిక రైతులు జాయింట్ కలెక్టరుకు తెలిపారు. రీసర్వే ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని రైతులకు ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు. అనంతరం టంగుటూరు తహసీల్దారు కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ సందర్శించారు. రీసర్వేకు సంబంధించిన డేటా ను విలేజ్ సర్వేయర్ లాగిన్ లో ఏ విధంగా నమోదు చేస్తున్నారో పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఐసిడిఎస్ అధికారులు ఏర్పాటు చేసిన ' కిషోరి వికాసం ' కార్యక్రమంలో కూడా జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. కిషోర ప్రాయంలోని బాలికల అభివృద్ధి, ఆరోగ్యం, సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
వీరితో జిల్లా సర్వే అధికారి గౌస్ బాషా, ఎంపీడీవో దేవసేన కుమారి, తహసిల్దార్ ఆంజనేయులు, ఇతర అధికారులు ఉన్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0