NH-16 పై ప్రమాదాల నివారణ చర్యల పరిశీలన

May 26, 2026 - 09:28
 0  52
ప్రమాదాల నివారణ ప్రధమ లక్ష్యం
1 / 1

ప్రమాదాల నివారణ ప్రధమ లక్ష్యం

ప్రకాశం జిల్లా ఎస్పీ V హర్ష వర్ధన్ గారి సూచనల మేరకు, ఒంగోలు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ R సుశీల, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ Y శ్రీహరి, సింగరాయకొండ ఎస్‌ఐ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ రహదారి-16 పై ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రత్యేక పరిశీలన నిర్వహించారు. టంగుటూరు మండలంలోని నాయుడుపాలెం ప్రాంతం మరియు సింగరాయకొండ మండల పరిధిలో ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ పాయింట్ వద్ద అధికారులు ప్రత్యక్షంగా పర్యటించి, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించారు. ప్రమాదాలను ఎలా నివారించవచ్చు, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలి అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా NH-16 తరఫున సైట్ ఇంజనీర్ యశ్వంత్ రెడ్డి, రెసిడెన్షియల్ ఇంజనీర్ ప్రసన్న కుమార్, పీఆర్‌వో నరసింగరావు పాల్గొన్నారు. ప్రమాద నివారణలో భాగంగా స్పీడ్ కంట్రోల్ బోర్డులు, కాషన్ బోర్డులు, యాక్సిడెంట్ ప్రోన్ జోన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ, టంగుటూరు పోలీసు సిబ్బంది మరియు NH-16 సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 2
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0