సింగరాయకొండ హైవే వద్ద కార్గో వాహనం దగ్ధం...తప్పిన పెను ప్రమాదం
*సింగరాయకొండ వద్ద కార్గో వాహనం దగ్ధం - తప్పిన పెను ప్రమాదం* *సింగరాయకొండ, నవంబర్ 02 :* ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలోని జాతీయ రహదారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి కార్గో వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. *ఘటన వివరాలు:* టంగుటూరు హైవే మొబైల్ పరిధిలో, కుంభకోణం కేఫ్ కాఫీ సమీపంలో ఒంగోలు నుండి కావలి వైపు వెళ్తున్న *AP 39 WR 9072* నంబర్ గల *RSR ఎక్స్‌ప్రెస్ కార్గో (Tata Bada Dost)* వాహనం AC యూనిట్ నుండి పొగలు రావడం గమనించిన డ్రైవర్ *R. ప్రవీణ్* వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. తనిఖీ చేస్తుండగానే వాహనం నుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు, సింగరాయకొండ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని టంగుటూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. విజయవాడ నుండి చెన్నైకి స్వీట్ల లోడుతో వెళ్తున్న ఈ వాహనం పూర్తిగా కాలిపోయింది. అయితే స్థానికులు, పోలీసుల చొరవతో వాహనంలోని *సుమారు 70% సరుకును సురక్షితంగా బయటకు తీయగలిగారు.* సింగరాయకొండ CI మరియు SI లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0