కొండేపి పరిధిలోని పలు ఐసిడిసి అంగన్వాడి కేంద్రాల్లో సంక్రాంతి సంబరాలు

Jan 13, 2026 - 12:59
Jan 13, 2026 - 13:00
 0  12
కొండేపి  పరిధిలోని పలు ఐసిడిసి అంగన్వాడి కేంద్రాల్లో సంక్రాంతి సంబరాలు
కొండేపి  పరిధిలోని పలు ఐసిడిసి అంగన్వాడి కేంద్రాల్లో సంక్రాంతి సంబరాలు

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ పరిధిలోని పలు ఐసిడిసి అంగన్వాడి కేంద్రాల్లో సంక్రాంతి సంబరాలను ముందుగానే ఘనంగా నిర్వహించారు సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథిగా జిల్లా పిడి Sసువర్ణ కొండపిసి సిడిపివో సుశీల దేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాలలోని పిల్లల తల్లుల సహకారంతో భోగిపండ్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి పండుగ ప్రాముఖ్యతను చాటిచెప్పారు. చిన్నారులకు సంక్రాంతి అంటే ఏమిటి, సంకురాత్రి పండుగ వెనుక ఉన్న సంప్రదాయాలు, ఆచారాల గురించి సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. గ్రామీణ సంస్కృతిలో సంక్రాంతి పండుగకు ఉన్న ప్రాధాన్యత, కుటుంబ సమైక్యత, పశుసంపద పూజ, పంటల పండుగగా దీనికి ఉన్న విలువలను పిల్లలకు తెలియజేశారు. అలాగే పౌష్టిక ఆహారాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు, గుడ్లు, పప్పులు, చిరుధాన్యాలు వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. గర్భిణీ స్త్రీలు మరియు చిన్నారులు సమతుల్య ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, శారీరక-మానసిక అభివృద్ధి వేగంగా జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు, పిల్లల తల్లులు ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి సంబరాలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు.

Files

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0