పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ.డోలా. శ్రీ బాల వీరాంజనేయ స్వామి..
పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ.డోలా. శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
మంగళవారం కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు మండల కేంద్రంలో సుమారు 42 లక్షలతో నిర్మించిన రోడ్లు, సైడు కాలువలను మారిటైమ్ బోర్డు చైర్మెన్ శ్రీ.దామచర్ల సత్యతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మట్లాడుతూ, కొండపి నియోజకవర్గంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉదేశ్యంతో అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ .నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నీళ్ళు ఇబ్బందిగా ఉందని చెప్పగా వారు ఇప్పుడు మూసి నది నుంచి 0.6 TMC లు ఒంగోలు మేజర్ బ్రాంచ్ కెనాల్ నుంచి మూసి కి నీరు వచ్చేలా అనుమతులు ఇచ్చారని, అక్కడ 24 లక్షలు పెట్టి ఎస్కేప్ చానెల్ నిర్మాణానికి నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలియజేశారు. రాష్ట్రం లో గుంతలు లేని రోడ్లును నిర్మించాలని ఉదేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగా కొండపి నియోజకవరంలోనే టంగుటూరు నుంచి పొదిలి రోడ్డుకు 5 కోట్లు మంజూరు కావడం జరిగిందని, అందులో, టంగుటూరు బైపాస్ కి 2 కోట్లు, మిగతాపనులకు 3 కోట్లు, ఉప్పలపాడు నుంచి నిదమానురుకి 3కోట్లు, కందులూరు నుంచి మర్లపాడుకి 2 కోట్లు, మర్లపాడు నుంచి కొణిజేడుకి 3 కోట్లు, కొణిజేడు నుంచి పొందురుకి 2.45 లక్షలు, పెళ్లూరు నుంచి వాసేపల్లిపాడు కి 2.40 లక్షలు, టంగుటూరు నుంచి వెలగపూడి కి కోటి రూపాయలు, టంగుటూరు నుంచి ఆలకూరపాడుకి 3.30 లక్షలు, టంగుటూరు నుంచి రాయవారిపల్లె నుంచి పాకలకి 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. కొండేపి మండలం కామేపల్లి రోడ్డుకి 2 కోట్లు, ముతరాసిపాలెం కి 1 కోటి ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేస్తే మరలా మన ప్రభుత్వం వచ్చాక తిరిగి వాటిని ప్రారంభించామన్నారు. భవిష్యత్తులో ప్రతి మండల కేంద్రం లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.త్వరలో సుమారు 700 ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చెయ్యటానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి అండగా నిలుస్తామన్నారు. శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. హౌస్ సైట్ కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి గాని లేకుంటే కొనుగోలు చేసి ఇవ్వటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ సందర్భంగా మారిటైమ్ బోర్డు చైర్మెన్ శ్రీ.దామచర్ల సత్య గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అబివృద్ధి , సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా వచ్చే సంక్రాంతి కల్లా ఇచ్చిన హామీలలో బాగంగా ప్రతి గ్రామంలో కనీసం 70 శాతం హామీలు అమలు చేస్తామని ఆయన బరోసా ఇచ్చారు. భారత దేశ చరిత్రలో పింఛన్ల కోసం సంవత్సరానికి 34 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని ఆయన తెలిపారు . మారిటైమ్ బోర్డు చైర్మెన్ గా నేను ఈ రెండు సంవత్సరాలలో 4 నుంచి 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సత్య గారు తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా 3 పోర్టులు పూర్తి చేసుకోబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. రామాయపట్నం పోర్టు జిల్లాకు ఒక వరమని దీని ద్వారా చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.
అనంతరం మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి గారు టంగుటూరులోని టి.టి.డి కళ్యాణ మండపం రోడ్డులో నూతనముగా నామకరణము చేసిన "వివేకానంద మార్గ్" లో స్వామి వివేకానంద విగ్రహాన్ని మారిటైమ్ బోర్డు చైర్మెన్ శ్రీ. దామచర్ల సత్య గారితో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0