గీతం స్కూల్లో ముందస్తు ఉగాది సంబరాలు ..
సింగరాయకొండ గీతం (జోన్స్) స్కూల్ నందు ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో ప్రత్యేక అలంకరణగా నిలిచారు. అనంతరం చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ ముందస్తుగా విద్యార్థిని విద్యార్థులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ చైత్ర శుద్ధ నాడు పాడ్యమి వసంత ఋతువు ప్రారంభంలో, ప్రకృతి కొత్త చిగుర్లతో కళకళలాడుతున్నప్పుడు ఈ పండుగను జరుపుకుంటారు. అదేవిధంగా షట్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి ఈ పండుగ ప్రత్యేకత, మరియు జీవితంలో కష్టసుఖాలను సభంగా స్వీకరించాలని సందేశాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తాజుద్దీన్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0