కొండేపి లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు..

Apr 20, 2026 - 09:31
 0  44
ప్రకాశం జిల్లా
 
 కొండేపి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  జన్మదిన వేడుకలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యకర్తల తో కలిసి కేక్ కట్ చేశారు మంత్రి స్వామి.  ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు.అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు. అనంతరం కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు
 రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిడోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0