సీతాదేవి పుట్టినరోజు సందర్భంగా లక్ష మల్లెపూలతో పూజ కార్యక్రమం ..
సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమి(సీతా జయంతి లేదా జానకి నవమి అని కూడా పిలుస్తారు) గా జరుపుకుంటారు , ఇది సీతాదేవి ఆవిర్భావ దినోత్సవాన్ని సూచిస్తుంది. 25-04-2026 వ తేదీ శనివారం రైల్వే రోడ్డులో వేంచేసియున్న కోదండరామ స్వామి దేవస్థానం నందు హనుమాన్ చాలీసా, పారాయణం, సీతా అమ్మవారి అమ్మవారికి లక్ష మల్లెపూలతో భక్తులచే సహస్రనామార్చన, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ, తదుపరి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. లక్ష మల్లెపూల పూజ ఉభయ దాతలు గంగిశెట్టి రత్తయ్య - లక్ష్మీ కుమారి దంపతులను వేద పండితులు ఘనంగా ఆశీర్వదించారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0